శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీ లో రోడ్డు కుంగి అకస్మాత్తుగా ఏర్పడిన భారీ గుంతను కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. అనంతరం గుంతను పూడ్చి మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఓపెన్ నాలాలోని నీరు డ్రైనేజి మ్యాన్ హోల్ లోకి చేరడంతో 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల లోతులో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడిందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అన్నారు.
వాహన దారులకు, పాదచారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గుంత వైపు వెళ్లకుండా గుంత చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, బారికేడ్లు ఏర్పటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు రోడ్డును అందుబాటులో కి తీసుకురావాలని, రోడ్డుపై గుంత ఏర్పడగా వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టి రోడ్డు పునరుద్ధరణ చర్యలు తీసుకొని, రోడ్డుపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియజేశారు. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి GM బ్రిజేష్ కుమార్, DGM వేంకటేశ్వర్లు, మేనేజర్ బిక్కు లాల్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణ రావు, భవాని తదితరులు పాల్గొన్నారు.