హ‌రిహ‌ర దేవి క్షేత్రంలో రూ.3.16 ల‌క్ష‌లు ప‌లికిన గ‌ణ‌ప‌తి ల‌డ్డూ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ ఎ బ్లాక్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం హరి హర దేవి క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన గణపతి లడ్డూ వేలం పాటలో శ్లోక చిట్ ఫండ్స్ య‌జ‌మానులు మెడిశెట్టి మాదవి, రాముపటేల్ దంపతులు రూ.3,16,116 ల‌కు లడ్డూను ఆన్‌లైన్‌ వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. ప్రజలందరూ వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ లడ్డూ దక్కించుకొని దేవాలయ అభివృద్ధికి సహకరించినందుకు వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వేలం పాట‌లో ద‌క్కించుకున్న ల‌డ్డూతో శ్లోక చిట్ ఫండ్స్ య‌జ‌మానులు రాముపటేల్, మాధవి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here