లింగంపల్లి అండర్ బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడుతాం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీటి నిల్వ ఉండడంతో నెలకొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఎడతెరిపి లేకుండా అకాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న వరద ముంపు ప్రాంతం సమస్యను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. వర్షం కురుస్తున్న ప్రతిసారీ అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం వాటిల్లుతుందని,‌ తీవ్ర సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపడుతామన్నారు.

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చేపట్టిన చర్యలపై అధికారులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నాలాలో పేరుకుపోయిన చెత్తా చెదరాన్ని తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. నాలాకు ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమాత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని సూచించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఈఈ శ్రీకాంతిని, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, టీఆర్ఎస్ నాయకులు జనార్ధన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, ఎండీ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here