నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహుబుబ్ పెట్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సహకారంతో బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి విద్యార్థులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఉచితంగా బ్యాగ్ లను పంపిణి చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులను అందజేసిన బిల్డర్స్ అసోసియేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆయూబ్, నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నరెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మి నారాయణ, సుబ్బారెడ్డి, నరేంద్ర ప్రసాద్, రవి, నెహ్రూ, నర్సింహ రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.