నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.