శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): రక్తదానం ప్రాణదానంతో సమానమని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. గురువారం హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, ఎమ్మెల్యే గాంధీ, మిత్రులు, అభిమానుల సమక్షంలో కేకును కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా 100 మంది స్వచ్చందంగా హాజరై రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణ దానంతో సమానమని, అందుకు యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు.
హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం పేదలకు, విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందజేయడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, నాయకులు మల్లికార్జున్ శర్మ, మిద్దెల మల్లారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘునాథ్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు కరుణాకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, బాసిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాశీనాథ్, శాంతి భూషణ్ రెడ్డి, ఘాలి కృష్ణ, మహిపాల్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, మారం వెంకట్, రాజశేఖర్, మారం ప్రసాద్, పుట్ట వినయ కుమార్ గౌడ్, భిక్షపతి సాగర్, శంకర్ ముదిరాజ్, షర్పుద్ధిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.