ఎమ్మెల్యే గాంధీ సంస్కార హీనుడు: ర‌వీంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. ఆంధ్రా గూండాలను దాడికి ఉసి గొల్పిన ఆరెక‌పూడి గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బూతులతో పాడి కౌశిక్ ను తిట్టారని, అదే మాటలు తాము అనలేక కాదని, తమకు సంస్కారం ఉంద‌ని వెల్లడించారు. ఆరెక‌పూడి గాంధీ ఓ సంస్కార హీనుడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవాం కాదా..? అని నిలదీశారు.

మీడియాతో మాట్లాడుతున్న ర‌వీంద‌ర్ యాద‌వ్

మగాడిలా రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆరెక‌పూడి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్ని చ‌వట పనులు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారాస నేతలను నోటికి ఏది వస్తే అది అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా అని గాంధీని ప్రశ్నించారు. ఆరెక‌పూడికి కొంచెం సంస్కారం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. శేరిలింగంపల్లి ప్రజలకు ఇప్పుడిప్పుడే గాంధీ బుద్ధి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన నువ్వు ప్రతిపక్ష పార్టీపలో ఉన్నట్లు ఎలా అవుతుందని నిలదీశారు. ముందు శేరిలింగంపల్లి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. భారాసను విమర్శించే అర్హత ఆరెక‌పూడి గాంధీకి లేదని రవీందర్ యాదవ్ అన్నారు. గులాబీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని, నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బ్రోకర్ లు ఎవరో శేరిలింగంపల్లి ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్పేందుకు భారాస కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here