శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): సీపీఐ (ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మరణం దేశానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఎం శేర్లింగంపల్లి జోన్ కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు జోన్ కార్యదర్శి సి.శోభన్, జోన్ కమిటీ సభ్యులు వి.మాణిక్యం, కె.కృష్ణ, కె.వరుణ్‌లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుడిగా అనంతరం సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పార్టీ అఖిల భారత కార్యదర్శిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారని అన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారన్నారు. ఏ బాధ్యతల్లో ఉన్నా ప్రజల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అలుపెరుగని శ్రామికుడిలా నిత్యం ఉద్యమాలు చేసేవారన్నారు. భారతదేశ వామ పక్ష ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి అన్నారు. ఆయన అకాల మరణం తీవ్ర విషాదానికి గురి చేసిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు.