పేదింటి ఆడబిడ్డ‌ల‌కు వ‌రం క‌ల్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంద‌ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సోమ‌వారం శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల‌ ద్వారా మంజూరైన రూ.1,11,12,876 ఆర్థిక స‌హాయాన్ని 111 మంది లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల రూపేణా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు.

ల‌బ్ధిదారుల‌కు క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కుల‌ను అందజేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డల‌కు పెద్దన్నలాగా నిలుస్తున్నార‌ని అన్నారు. ఆడ‌బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగింద‌ని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐI శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, గంగాధర్, ప్రసాద్, చంద్రిక ప్రసాద్ గౌడ్, సుప్రజ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here