శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది విద్యార్థులకు సేవలు అందించారు. మియాపూర్‌లోని పలు కేంద్రాల్లో 10, 12వ తరగతి పరీక్షలను రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు మియాపూర్ పోలీసులు సురక్షితమైన, సాఫీగా ప్రయాణం సాగేలా సౌకర్యాలు కల్పించారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు, ఆల్విన్ జంక్షన్, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది విద్యార్థులను అభినందించారు. పరీక్షలకు ముందు వారికి పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేసి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






