శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మండల ప్రాథమిక వైద్యశాల MHOకి బస్తీ దవాఖానాలలో మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని నర్సింగ్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శంకరోల్ల సురేష్ ముదిరాజ్, డిస్టిక్ కమిటీ మెంబర్ వనం పద్మ, శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






