శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఎ బ్లాకు, ప్రేమ్ నగర్ కాలనీ ఎ బ్లాకులలో ఉన్న ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజ, అన్నదాన కార్యక్రమాలలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. శివ లింగానికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులతో కలసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జే. బలరాం యాదవ్, ఎల్లారెడ్డి, అశోక్, చెంగయ్య, ఉజ్జిని శ్రీనివాస్, చలపతి, నర్సింహా రెడ్డి, రమేష్ యాదవ్, శారద, ఉజ్జిని శ్రీరామ్, నరేందర్ రెడ్డి, నాగరాజు యాదవ్, రంగారెడ్డి, వెంకటేష్, అభి అక్షయ్, మొహ్మద్ వసీం తదితరులు పాల్గొన్నారు.






