నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో నాల్గవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఇందులో భాగంగా సాయిరాంనగర్‌లో స్థానిక కర్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదవారం పర్యటించారు. స్థానికంగా నెలకొని సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చాలా కాలంగా పడిఉన్న మట్టి కుప్పలను జీహెచ్ఎంసీ సిబ్బందిచే తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్‌పీ కనకరాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.