మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు: ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని సాయుధ పోరాటం ద్వారానే భారతమాతకు విముక్తి కలుగుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతరామరాజు అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి‌ గాంధీ అన్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు 124 వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పూలమాల వేసి ఘన‌ నివాళి అర్పించారు.

అల్లూరీ సీతారామ‌రాజు విగ్ర‌హానికి నివాళుల‌ర్పిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ త‌దిత‌రులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని , మన్యం ప్రజలలో విప్లవ బీజాలు నాటి ప్రజలను  చైతన్యపరిచి  స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా ఉత్తేజపరిచారన్నారు. ఆయన అడుగు జాడలో యువత నడవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, శ్రీనివాస్ గోపారాజు, శ్రీనివాస్, చంద్రశేఖర్, రోజా, కృష్ణం రాజు ,పవన్ రాజు, హరికృష్ణ ,సుధాకర్ రెడ్డి, దుర్గ రాజు, సీతారామరాజు, శివరామరాజు, పుల్లం రాజు ,రమాదేవి ,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here