రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న‌ మిరియాల ప్రీతం

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లోని ఈద్గా వద్ద నిర్వహించిన పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో మిరియాల ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర నెలలో ప్రతి ఒక్కరు ప్రేమ, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని, అల్లాహ్ అందరి ప్రార్థనలు స్వీకరించి వారి కోరికలను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిరియాల రాఘవరావు, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే చందానగర్ డివిజన్‌కు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here