శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ మెట్రో గ్రౌండ్లో ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ను అట్టేపల్లి రామప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక యువతతో కలిసి ఉత్సాహంగా గడుపుతూ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపుతూ, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా రామప్రభు హామీ ఇచ్చారు.






