సిటిజెన్ కాలనీ వినాయక పూజల్లో పాల్గొన్న మిరియాల ప్రీతం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ సిటిజన్ కాలనీలో పి.జె.ఆర్. స్టేడియం సమీపంలో గణపతి నవరాత్రుల‌ సందర్భంగా విగ్నహరత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ మండపం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిరియాల ప్రీతం మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి విగ్రహాలను ఉపయోగించటం అనివార్యం అని అన్నారు. ఇలాంటి సామాజిక బాధ్యతను చాటుతూ యువత ముందుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కె.శివరాం, టి.విష్ణుమూర్తి, త్రినాధ్, పి. అంజిరెడ్డి, శ్రీనివాస్ నాయక్, ఊరిటి వెంకట్ రావు, కె.లక్ష్మీ విగ్నేష్, రితిక్ రెడ్డి, రిత్విక్ సాయి, చ‌రణ్, హేమంత్ శివ, శశాంక్, వివేక్ వర్ధన్, యశ్వంత్, ఉమేష్, గణేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here