శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ &ఉమెన్స్ వేర్, ఫుట్ వేర్ అండ్ టైస్ షోరూంను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇంచార్జి రవి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా నాణ్యమైన సరసమైన ధరలకు వస్తువులను అందుబాటులో ఉంచాలని, నాణ్యత పట్ల అలసత్వం వహించొద్దని, మంచి లాభాలు గడిస్తూ భవిష్యత్తులో మరెన్నో శాఖలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం యజమాని ప్రభాకర్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ మాధవరం కాంతారావు, సీనియర్ నాయకులు నాగులు గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, కిరణ్ కుమార్ రెడ్డి, విజేందర్, రాము పాల్గొన్నారు.






