నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్లోని శ్రీ సీతారమంజనేయ దేవస్థానం రెండవ వార్షిక శ్రీ సుదర్శన మహాయజ్ఞ మహోత్సం సోమవారం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన మండప అర్చన, శ్రీ రామ తారక మూల మంత్ర సహిత సుదర్శన హోమాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతి కాలంలోనే శ్రీ సీతారామంజనేయ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందినదని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఆద్యాత్మికంగా స్వాంతన పొందుతున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధిలో తమవంతు భాగస్వామ్యం ఎప్పటికి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుడా ట్రేడ్ సెంటర్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మహేష్ గౌడ్, రాగం శ్రీనివాస్ యాదవ్, గోపాల్ యాదవ్, కొయ్యడా లక్ష్మణ్ యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.






