నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి నిత్యం దైవ కైంకర్యాలు నిర్వహించే పూజారుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ రామాలయం దేవస్థానంలో పూజారులు నివాసం ఉండేందుకు నిర్మించిన వసతి భవనాన్ని ప్రభుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేటర్ సింధుఆదర్శ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలోని పూజారుల కోసం నివాసం ఉండేందుకు, తదితర సౌకర్యాల కోసం స్థానిక కార్పొరేటర్ సింధుఆదర్శ్ రెడ్డి రూ. 5 లక్షల స్వంత ఖర్చులతో పాటు దాతల విరాళాల ద్వారా సేకరించిన రూ. 10 లక్షలతో వసతి భవనాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. సమాజ హితం కోసం సమాజ సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ ముదిరాజ్, చందానగర్, మాదాపూర్ డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సెక్రెటరీ కుమార్, కాలనీ అధ్యక్షుడు బాలయ్య, సత్యనారాయణ, గిరి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

