శేరిలింగంప‌ల్లిలోని ప్రైవేటు స్కూళ్ల యాజ‌మాన్యాల‌తో ఎంఈవో స‌మావేశం

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ప్రైవేటు స్కూళ్ల యాజ‌మాన్యాల‌తో మండ‌ల విద్యాధికారి ఎం.వెంక‌ట‌య్య శ‌నివారం స‌మావేశం నిర్వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్ల‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఆయ‌న వివరించారు. ముఖ్యంగా క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచాల‌న్నారు. మూత్ర‌శాల‌లు, పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌, గ‌దులు, ఇత‌ర ప్ర‌దేశాల‌ను శుభ్రంగా ఉంచాల‌న్నారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించేలా చూడాల‌న్నారు. మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం చేయాల‌న్నారు. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి 9,10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠ‌శాల‌లు ప్రారంభం అవుతున్నాయ‌ని తెలిపారు. అన్ని జాగ్ర‌త్త‌ల నడుమ పాఠ‌శాల‌ల‌ను నిర్వ‌హించాల‌ని ప్రైవేటు స్కూళ్ల యాజ‌మాన్యాల‌కు సూచించారు.

ప్రైవేటు స్కూళ్ల య‌జ‌మానుల‌తో మాట్లాడుతున్న మండ‌ల విద్యాధికారి ఎం.వెంక‌ట‌య్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here