హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హఫీజ్‌పేట డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్‌ల ఆదేశాల మేరకు వార్డు మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్ పర్యవేక్షణలో డివిజన్ తెరాస యూత్ వింగ్ నాయకుడు జి.రోహిత్ ముదిరాజ్ సోమవారం తెరాస సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ తెరాస సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ఇందుకు సంతోషంగా ఉందని అన్నారు. తెరాస యూత్ వింగ్ నాయకులు డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో పర్యటిస్తూ సభ్యత్వాలను నమోదు చేయిస్తున్నారని తెలిపారు. తెరాస పార్టీకి యువతే బలం అని అన్నారు. తెరాసలో అనేక మంది యువ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస యూత్ వింగ్ నాయకులు జీవన్ ముదిరాజ్, కిరణ్, విగ్నేష్, శివ, శ్రావణ్ పాల్గొన్నారు.
