మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్కేవై టీం ఆధ్వర్యంలో పిల్లలకు బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పరిశుభ్రతను వివరించారు. అనంతరం ఆర్కేవై టీం ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కేవై టీం చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేవై టీం అధ్యక్షుడు గంగారం మల్లేష్, ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, సారా రవీందర్, రాజారావు, శ్రీను, రాము, శివ రాజ్, బాబు ముదిరాజ్, వెంకట్, రాజు నాయక్, వెంకట్, నారాయణ, ప్రతాప్, రవి పాల్గొన్నారు.
