మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వారు కొత్త కోవిడ్ ఫ్రీ (నాన్ కోవిడ్) అవుట్ -పేషెంట్ కేంద్రాన్ని హైటెక్ సిటీ (సైబర్ గేట్ వే ఎదురుగా) ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. కోవిడ్ ను నియంత్రించేందుకు, పేషెంట్ కి అతి తక్కువ సమయంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుభవజ్ఞులైన వైద్యులచే కన్సల్టేషన్ అందించేందుకు ఈ శాఖను ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, డాక్టర్ కృష్ణ కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, శరత్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

