- మదీనాగూడ మైత్రి కామన్ నుండి దీప్తి శ్రీ నగర్ వరకు ఎంసిపిఐయు భారీ ర్యాలీ
నమస్తే శేరిలింగంపల్లి: మదీనాగూడ మైత్రి కామన్ నుండి దీప్తి శ్రీ నగర్ వరకు శుక్రవారం ఎంసిపిఐ యు పార్టీ మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ ఐ యు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ తమ రాజకీయ ప్రయోజనాలను అడ్డుపెట్టుకుని అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ఎనిమిది సంవత్సరాల తరువాత బిజెపి దాని మత సంస్థలు 4 రోజుల పటేల్ సైన్యాల విజయమని విమోచన ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమానికి పూనుకుందని, టిఆర్ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతూ ఆనాటి ప్రజల చరిత్రను పాఠ్యాంశాలలో కాని, వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో విఫలమై నేడు సెప్టెంబర్ 17ను సంవత్సరం పాటు జాతి సమాఖ్య దినంగా జరుపుతున్నామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలక వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన, అవకాశవాద పరమైన విధానాలకు అవలంబించే దానికి ప్రజలు గమనిస్తున్నారని, నాటి వాస్తవిక ప్రజల విరోచిత పోరాట చరిత్రను వక్రీకరించే ఈ పాలక వర్గాల పార్టీలను, ప్రభుత్వాలను నాటి పోరాట వారసత్వ చైతన్యంతో తగిన బుద్ది చెప్పాలని ఎంసిపిఐ(యు) పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమం కామ్రేడ్ ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమం లో మైదం శెట్టి రమేష్ పల్లె మురళి, తుకారాం నాయక్ , కర్ర దానయ్య, శ్రీనివాస్, విమల, గూడ లావణ్య, లక్ష్మి నర్సింహా, సుల్తానబేగం, శివాని, లలిత, నారాయణ, మధుసూదన్ కె రాజు విరమణి, చందర్, శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు