శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఎంసీపీఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ముజఫర్ అహమ్మద్ నగర్,(ఎం ఎ నగర్ )లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని హఫీజ్ పేట్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. యం సి పి ఐ (యు)నాయకులు మాట్లాడుతూ మియాపూర్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ బస్తీలో వెనుక భాగంలో ఉన్న నాలుగు లైన్లలోని ప్రజలకు సరిగ్గా నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముజఫర్ అహ్మద్ నగర్ రోడ్ నంబర్ 1 లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ పూర్తిగా పాడైందని, అంబేద్కర్ విగ్రహం ఉన్న రోడ్డులో అండర్ డ్రైనేజ్ లైన్ పూర్తిగా లీకైందని అన్నారు. దీనివల్ల రోడ్డుపైకి మురుగునీరు పొంగిపొర్లుతుందని, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారరని, అనారోగ్యాల పాలవుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ జి ఎంని కలిసి సమస్యను వివరించారు. అందుకు జీఎం స్పందిస్తూ నవంబర్ చివరి తేదీలోగా తమ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యం సిపిఐ(యు) సీనియర్ నాయకురాలు కుంభం సుకన్య, మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, సహాయ కార్యదర్శి పల్లె మురళి, డివిజన్ కమిటీ సభ్యురాలు శివాని, ఇందిరా బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






