శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశంలో కార్మికుల గౌరవానికి పునాది వేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక దూరదృష్టి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద డివిజన్ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల శక్తి, అంకితభావం, త్యాగాలను గౌరవించే రోజు అని అన్నారు. కార్మిక హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు స్వాతంత్ర్య సమర కాలం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్కనే నిలిచిందని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, నాయకులు రవీందర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ తహేర్ హుస్సేన్, అయాజ్ ఖాన్, నర్సింహ, ఇస్మాయిల్, నర్సింగ్ రావు, హరి కిషన్, సౌందర్య రాజన్, శ్రీహరి, చంద్రమౌళి, మధు, ఖాజా, భారత్ తదితరులు పాల్గొన్నారు.






