శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మదీనాగూడ త్రివేణి విద్యాసంస్థ పదో తరగతి విద్యార్థులు మనస్విని 585, హర్షిత 585, పూజిత 584, ఆదిత్య సాయి 583 , 17 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 550కు పైగా మార్కులతో విజయం సాధించారు. వారిని శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, ఆరెకపూడి గాంధీ అభినందించారు. ప్రతి విద్యార్థిని శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. త్రివేణి స్కూల్ యాజమాన్యం డాక్టర్ వీరేంద్ర చౌదరి విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతారని, ఆయన కమిట్మెంట్ కి నిదర్శనం ఈ ఫలితాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఆర్వో సాయి నరసింహారావు, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, హాస్టల్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు, ఏసీఆర్వో నరేష్, నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






