త్రివేణి హై స్కూల్ విద్యార్థులకు ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్ అభినంద‌న‌లు

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రివేణి విద్యార్థులను చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అభినందించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ త్రివేణి హై స్కూల్ విద్యార్థులు సీఆర్వో సాయి నరసింహావుతో కలిసి మసీద్ బండలోని రవి కుమార్ యాదవ్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగ క‌లిశారు. ప‌దవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల‌ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విషయపరిజ్ఞానంతో కూడిన ఉత్తమ ఫలితాలను సాధించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న , హాస్టల్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు, ఏసీఆర్వో నరేష్ , నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here