మాదాపూర్, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): సీనియర్ జర్నలిస్టు ఈటీవీ సిటీ బ్యూరో చీఫ్ ఆదినారాయణ మృతి పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి లేబర్ సెల్ చైర్మన్ నల్లా సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, మూర్తి, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.