శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ లో వాటర్ ఎయిడ్ ఇండియా కమ్యూనిటీ ఫెసిలటర్ దేవదాస్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి, లీకేజీలను గుర్తించి సత్వరమే వాటికి మరమ్మత్తులు చేసుకోవాలనే అవగాహన కార్యక్రమంపై వివరించారు. ఎం.ఎ నగర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దోర్నాల రవికుమార్, సురేష్ యాదవ్, కడుకుంట్ల రాంబాబు, బిజెపి నాయకులు ప్రవీణ్ గౌడ్, అనిల్ రెడ్డిల బృందం స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి కాలనీలో వీధి వీధి తిరుగుతూ సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అంటూ నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. నీటి విలువ గురించి తెలియపరుచుతూ నీటి వృథాను అరికట్టాలని, ప్రతి ఇంట్లో నీటి నిల్వ ట్యాంకులు నిండితే వెంటనే నల్లా కట్టేయాలని, దీంతో ఇతరుల అవసరాల కోసం వారికి ఆ నీరు ఉపయోగ పడుతుందని అన్నారు.
వృథాగా రోడ్ల పైకి, డ్రైనేజ్ లోకి వదలవద్దు అని తెలియ జేశారు. హైటెక్ జోన్ లో నీటి ఇబ్బందులు రాకుండా ప్రతి గృహ నిర్మాణ దారుడు ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే లీకేజీ లాంటివి ఉంటే వెంటనే మరమ్మత్తులు చేసుకోవాలని అన్నారు. మానవుని దైనందిన జీవితంలో నీటి యొక్క ఆవశ్యకత, దాన్ని పొదుపుగా వాడుకోవాలిసిన అవసరాన్నిబండి రామకృష్ణ గౌడ్, కడుకుంట్ల రాంబాబు లు వివరిస్తూ భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగితే అవి మనకు ఉపయోగ పడతాయి కాబట్టి దీనిపై ప్రఇ ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ఉండాలని అన్నారు. లేదంటే పొరుగు రాష్ట్ర మైన కర్ణాటక నీటి కష్టాలు వస్తాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవీన్ నేత, మధు, శ్రీకాంత్, సత్య రాజ్, నాగేష్, హీరా వర్ణన్, సుమన్ లతో పాటు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.