నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ముడో దశ కరోనా రాకుండా అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేసుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్ఎంసీ, వైద్య శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. చందానగర్ డివిజన్ లోని శంకర్ నగర్ పార్కులో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ అందజేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.