నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ లో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ దేవాలయం ఆవరణలో నూతనంగా చేపట్టనున్న శివాలయ నిర్మాణానికి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.