నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని గంగారం లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ హఫీజ్ పేట్ యువజన అధ్యక్షుడు జి. రోహిత్ ముదిరాజ్ పేర్కొన్నారు. గంగారంలో డ్రైనేజీ పొంగుతోందని స్థానికుల ద్వారా తెలుసుకున్న రోహిత్ ముదిరాజ్ శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఇస్మాయిల్, వార్డు మెంబర్ శేఖర్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
