శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఈనెల 28న వరంగల్ లో జరగనున్న ఏఐఎఫ్ డీవై రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి.మధుసూదన్ అన్నారు. స్టాలిన్ నగర్ లో రాష్ట్రస్థాయి సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ.. వరంగల్‌లో రాష్ట్రస్థాయి సమావేశం దేశంలో, రాష్ట్రంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు కార్యచరణ రూపొందించడానికి ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు.సెప్టెంబర్ 28న షాహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా యువజన ఉద్యమాలను మరింత బలోపేతం చేయడానికి సమావేశం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ సమావేశానికి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి యువతీ, యువకులు హాజరవుతున్న సందర్భంగా యువత, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతుల విభాగం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కన్వీనర్ ఎం.డి సుల్తానా బేగం, కన్వీనింగ్ కమిటీ సభ్యులు డి.కీర్తి, ఇ.దశరథ్ నాయక్, డి.శ్రీనివాసులు, కె.షరీష్ తదితరులు పాల్గొన్నారు.