శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మాధవి నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కాలనీలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డును వేయాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపర్చాలని ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మాధవీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC EE గోవర్ధన్, DE రమేష్, AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, రవి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, మాధవీ నగర్ కాలనీ వాసులు మధుసూదన్ రెడ్డి, రఘు కుమార్, చిన్నారెడ్డి, కార్తీక్, అనిల్ కుమార్, రాంమోహన్ రావు, మురళి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.