మ‌న్ కీ బాత్‌ను వీక్షించిన మ‌హిపాల్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి లో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి కార్యాల‌యంలో ప్రధాన‌ మంత్రి నరేంద్ర మోదీ 135వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సంద‌ర్భంగా మ‌హిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌పై ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వ విధానాల ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here