హఫీజ్‌పేట్‌లో పల్స్ పోలియో కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో బీఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూపోలియో రహిత దేశ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్‌ఎంసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లు సమిష్టిగా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు.

హఫీజ్‌పేట్ డివిజన్‌లోని అన్ని పోలియో కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను గుర్తిస్తూ బీఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించగా, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here