భూమిపూజలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు దిగ్విజయంగా కొనసాగాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. జూలై 2, 3 తేదీల్లో జరగబోయే భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక హెచ్ఐసీసీ నోవాటల్ లో ఎలాంటి అడ్డంకులు అవరోధాలు కలగకుండా విజయవంతం కావాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్ఈసీ చైర్మన్, బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివ ప్రకాష్, బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షులు డి.కె అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, బాలసుబ్రహ్మణ్యం, చాడా సురేష్ రెడ్డి, నారపరాజు రామచందర్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు భూమి పూజ చేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here