నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చెరువులను రక్షించుకోవడంతో పాటు అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి నగర్ కాలనీ సమీపంలో ఉన్న నాయనమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది సహకారంతో తొలగింపజేశారు. నాయనమ్మ కుంట చుట్టూ ఫెన్సింగ్ వేసి వాకింగ్ ట్రాక్ తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగింపజేసి చెరువులోని నీరు కలుషితం కాకుండా చూస్తామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు.






