శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధు కుమార్ ఉప్పుటూరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని మధు కుమార్ అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేసి పార్టీని, అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటూ ఇంకా ఎన్నో అవకాశాలు కల్పిస్తామని TPCC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
