నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్‌నగర్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బస్తీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎంఏ నగర్ రోడ్ నెంబర్ 1లోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని రోడ్లపైకి పెద్దమొత్తంలో మురుగు నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బస్తీలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సీసీ రోడ్లు వేయాలని కోరారు. మసీదు వెనకాల ఉన్న పవర్ బోర్‌కు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటి సరఫర అందేలా చూడాలని కోరారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినగడంతో బస్తీ పరిసరాలు పూర్తిగా మురికి కూపంగా మారిపోయాయని, స్థానికులు రోగాల బారిన పడుతున్నారని, యుద్ధ ప్రాతిపధకన సదరు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వినతీ పత్రం సమర్పించిన వారిలో ఎంఏనగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






