నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. హఫీజ్‌పేట్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ వినయ్ బాబు పర్యవేక్షణలో సిబ్బంది సాయిబాబాకు కోవీషీల్డ్ టీకా అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అపోహలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ విధిగా అందరు వేసుకోవాలని, కరోనా నియంత్రణ వ్యక్సిన్తోనే సాధ్యమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు ఉపయోగించుకుని కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాయిబాబాతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంగారెడ్డి పాల్గొన్నారు.