గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నం.135తోపాటు ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో శుక్రవారం బీజేపీ నాయకులు ధర్నా, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనుక ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని, దేశలోని ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్ట సురేష్, రవీంద్ర ప్రసాద్ దూబే, కృష్ణ ముదిరాజ్, కిషన్, మహేష్, వెంకటేష్, వసంత్, అనిల్, శ్రీకాంత్, వెంకట్, విజయ్, నరేష్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.