బ‌తుక‌మ్మ చీర‌లు పేద మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తి

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
  • హఫీజ్ పేట్ డివిజన్ లో బ‌తుకమ్మ చీర‌ల పంపిణీ షురూ

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బ‌తుక‌మ్మ చీర‌లు పేద మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తున్న బ‌హుమ‌తి అని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శుక్ర‌వారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరలను హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఎంపీపీ స్కూల్ లో చందానగర్ సర్కిల్ డీసీ సుధాంష్, కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ ల‌తో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు.

మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞ‌తలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు బతుకమ్మ పండుగను ఘ‌నంగా జరుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం  ఉచితంగా చీరలను పంపిణీ చేయడం జరిగింద‌ని తెలిపారు. నియోజకవర్గంలో  పేద మహిళలకు చీర‌ల‌ను అందించడం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి  చెప్పిన‌ ఘనత తెరాస‌ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింద‌ని, బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి రాష్ట్ర సర్కారు తెరతీసింద‌ని అన్నారు. నాలుగేండ్లుగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నద‌న్నారు. ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగుల‌ను నింపుతుంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మా రెడ్డి, యాదగిరి గౌడ్, సంజు, సుదేశ్, సబీర్, షేక్ జమీర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here