చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చందానగర్ డివిజన్ లోని పట్టభద్రులు కొత్తగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ కోరారు. చందానగర్ డివిజన్ లోని పలు బ్యాంక్ ఉద్యోగులకు పట్టభద్రుల ఓటర్ నమోదు పత్రాలను అందజేసి, ఓటర్ నమోదు పై ప్రీతమ్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఓటరుగా నమోదు చేసుకుంటేనే రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.