మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: బీజేపీ నేతలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మసీద్ బండలోని బీజేపీ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్.కె.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్‌తో కలిసి విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని నాయకులు పేర్కొన్నారు. మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీజేపీ కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here