శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జి.రోహిత్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సమితి పెద్దలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కేఎస్ ఆనంద్ రావు, జాతీయ వ్యవస్థాపకుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. జైన్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సురేష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే జై గణేష్ భక్త సమితి ఉపాధ్యక్షుడు కమ్మరి మహేష్, లయన్ విజయ రంగారావు, అన్నెం కోటిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జై గణేష్ భక్తి సమితి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సమితి ఆశయాల కోసం కృషి చేస్తానని రోహిత్ ముదిరాజ్ పేర్కొన్నారు.





