సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు.. 6 రకాల పెన్షన్లకు అవకాశం: మియాపూర్ సర్కిల్‌ ప్రకటన

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అర్హులైన లబ్ధిదారులు వివిధ సామాజిక భద్రత పెన్షన్‌ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మియాపూర్ సర్కిల్‌–48, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) డిప్యూటీ కమిషనర్ జి.శ్రీ‌నివాస్‌ సూచించారు. వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు అందించే పెన్షన్‌ పథకాలకు అర్హులైన వారు సమీపంలోని మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here