PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన రిక్షా పుల్లర్స్ కాల‌నీ నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 9 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్స్(RP) కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో క‌లిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రిక్షాపుల్లర్స్ (RP) కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయ‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు , రిక్షాపుల్లర్స్ (RP) కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగయ్య, జనరల్ సెక్రెటరీ దొరపల్లి పర‌శురాములు, ట్రెజరర్ యాదగిరి, నాయకులు చిరుమర్తి రాజు, దుర్గ, రాధాబాయి, రవి, కాలనీ వాసులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here